EMRS 7,267 పోస్టులు 2025: టీచింగ్ & నాన్-టీచింగ్ భర్తీలు
దేశవ్యాప్తంగా టిబ్రల్ విద్యాభవిష్యత్తును మెరుగు పరచాలన్న లక్ష్యంతో, EMRS బృందం 2025 సంవత్సరానికి భారీ భర్తీల ప్రకటన చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 7,267 పోస్టులు టీచింగ్ మరియు నాన్-టీచింగ్ విభాగాల్లో భర్తీ చేయబోతున్నాయి.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు చివరి తేదీ: 23 అక్టోబర్ 2025
- ఫీజు చెల్లింపు చివరి తేదీ: 23 అక్టోబర్ 2025
- పరీక్ష తేదీలు త్వరలో ప్రకటించబడతాయి.
పోస్టుల వివరాలు
- టీచింగ్ పోస్టులు: ప్రిన్సిపాల్, PGT, TGT మొదలైనవి
- నాన్-టీచింగ్ పోస్టులు: హాస్టల్ వార్డెన్, ఫెమెల్ స్టాఫ్ నర్స్, అకౌంటెంట్, JSA, ల్యాబ్ అటెండెంట్ మొదలైనవి.
- హాస్టల్ వార్డెన్ – 635 పోస్టులు
- ఫెమెల్ స్టాఫ్ నర్స్ – 550 పోస్టులు
- ప్రిన్సిపాల్ పోస్టులు 225
- PGT 1460
- TGT 3962
- అకౌంటెంట్ 61
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 228
- ల్యాబ్ అటెండెంట్ 146
అర్హత వివరాలు (Educational Qualifications)
EMRS 2025 నియామకానికి పోస్టు ఆధారంగా విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి.
- ప్రిన్సిపాల్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పీజీ (Post Graduation) డిగ్రీతో పాటు B.Ed. లేదా సమానమైన బోధన అర్హత అవసరం. కనీసం 10 సంవత్సరాల బోధన లేదా పరిపాలనా అనుభవం ఉండాలి.
- PGT (Post Graduate Teacher): సంబంధిత సబ్జెక్ట్‌లో Post Graduation మరియు B.Ed. తప్పనిసరి.
- TGT (Trained Graduate Teacher): సంబంధిత సబ్జెక్ట్‌లో Graduation మరియు B.Ed. అర్హత అవసరం.
- హాస్టల్ వార్డెన్: ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. విద్యార్థుల పర్యవేక్షణలో అనుభవం ఉంటే అదనపు ప్రయోజనం.
- ఫెమెల్ స్టాఫ్ నర్స్: 12వ తరగతి (Intermediate) తో పాటు General Nursing & Midwifery (GNM) లేదా B.Sc Nursing పూర్తి చేసి రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
- అకౌంటెంట్: B.Com లేదా సమానమైన కామర్స్ డిగ్రీ అవసరం. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA): 12వ తరగతి (Intermediate) పాస్ అయి ఉండాలి. టైపింగ్ నైపుణ్యం ఉండాలి.
- ల్యాబ్ అటెండెంట్: 10వ తరగతి పాస్ చేసిన అభ్యర్థులు అర్హులు. సైన్స్ ల్యాబ్‌లో అనుభవం ఉంటే ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
వయస్సు పరిమితి
- వయస్సు పరిమితి పోస్టుల ఆధారంగా మారుతుంది (30 నుండి 50 సంవత్సరాలు)
- ప్రిన్సిపాల్ – గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు
- TGT, హాస్టల్ వార్డెన్, నర్స్ – గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు
- అకౌంటెంట్, JSA, ల్యాబ్ అటెండెంట్ – గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు
- SC, ST, BC వర్గాలకు వయస్సు సడలింపులు వర్తిస్తాయి
ఎంపిక విధానం
ఈ నియామకంలో EMRS Staff Selection Exam (ESSE) – 2025 ద్వారా ఎంపిక జరుగుతుంది. పోస్టు ఆధారంగా రాత పరీక్ష (Objective Type) ఉంటుంది. తుది ఎంపికకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు అవసరమైతే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు
- General / BC / EWS: ప్రిన్సిపల్ – ₹2500, PGT/TGT – ₹2000, నాన్-టీచింగ్ – ₹1500
- SC / ST / మహిళ / PwBD: ₹500
ముఖ్య సూచనలు
- దరఖాస్తు nests.tribal.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే చేయాలి.
- ఫోటో, సంతకం, మరియు అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేయాలి.