తెలంగాణలోని ITI మొదటి దశ (First Phase) సీట్ల కేటాయింపులు seat allotment విడుదల అయ్యాయి. ITI ప్రవేశాలకోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు Official Website లో లాగిన్ అయి Seat ఎక్కడ, ఏ కాలేజీ లో వచ్చిందో, ఏ Trade వచ్చిందో పూర్తి వివరాలు చెక్ చేసుకోవచ్చు. తమకు నచ్చిన కాలేజీ లో నచ్చిన Trade లో Seat వస్తే Seat Allotment లేటర్, విద్యార్ధి స్టడీ సర్టిఫికెట్స్ సంబంధిత కాలేజీ కి వెళ్లి రిపోర్టింగ్ చేసి Seat Conform చేసుకోవాలి. కాలేజీ కి వెళ్లి రిపోర్టింగ్ చెయ్యడానికి జులై 15 (15/07/2025) చివరితేది.
Seat allotment Date: 09/07/2025
Reporting Date: 09/07/2025 To 15/07/2025
First Phase లో Seat రాకపోతే?
ఒకవేళ అప్లై చేసుకున్న అభ్యర్థికి First Phase లో seat రాకపోతే, లేదా seat వచ్చిన కాలేజీ/ట్రేడ్ నచ్చకపోతే Second Phase లో మళ్ళి Web Options పెట్టుకోవచ్చు. First Phase లో seat వచ్చిన కాలేజీ కి వెళ్లి రిపోర్టింగ్ చెయ్యాల్సిన అవసరం లేదు.
గడువులోపు Reporting చెయ్యకపోతే?
ఒకవేళ First Phase లో seat వచ్చి, జులై 15 (15/07/2025) లోపు సంబంధిత కాలేజీ లో Reporting చెయ్యకపోతే మనకు వచ్చిన seat Cancel అవుతుంది. అయితే First Phase లో seat మిస్ అయినా Second Phase లో మళ్ళి Web Options పెట్టుకోవచ్చు.
First Phase లో Application చేసుకోనివారు?
First Phase లో ITI Application చేసుకొని వారికీ Second Phase లో మళ్ళి కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేసి అప్లికేషన్ Payment చేసి Second Phase కోసం Web Options పెట్టుకోవచ్చు. First Phase లో ITI Application చేసినవారు మళ్ళి అప్లికేషన్ చెయ్యాల్సిన అవసరం లేదు. నేరుగా Web Options పెట్టుకుంటే సరిపోతుంది.
Second Phase Dates :
Second Phase సంబంధించి ఇంకా ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. (First Phase) సీట్ల కేటాయింపులు seat allotment ప్రక్రియ పూర్తి అయినా తరువాత Second Phase సంబంధించి Notification విడుదల అవుతుంది.
ITI ఎందుకు?
గత 5,6 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ITI కి ఆదరణ పెరుగుతుంది. ITI చెయ్యడానికి 10 వ తరగతి విద్యార్హత సరిపోతుంది. మరియు ITI లో థియరీ, ప్రాక్టికల్ ఉండడం వాళ్ళ ఇలాంటి వృత్తి విద్యా కోర్స్ లను చెయ్యడం వల్ల విద్యార్థులకు ప్రాక్టికల్ knowledge వస్తుంది. ITI పూర్తి చేసిన తరువాత 1 సంవత్సరం Apprenticeship చెయ్యాలి. Apprenticeship Training సమయంలో ఆ అభ్యర్థికి అతని Trade పై పూర్తి ప్రాక్టికల్ knowledge వస్తుంది. ఇలాంటి అభ్యర్థులను కంపెనీలు ఎంప్లాయ్ గా తీసుకుంటాయి. లేదా ఆ వ్యక్తి తన own గా Trade పై పూర్తి అవగాహనా కలిగి ఉండడం వలన స్వయం ఉపాధి పొందవచ్చు. కావున చాల మంది ITI లాంటి వృత్తి విద్యా కోర్స్ లు చెయ్యడం వలన త్వరగా, సులభంగా ఉద్యోగం లేదా స్వయం ఉపాధి పొందవచ్చు కాబట్టి ITI కి ఆదరణ పెరుగుతుంది.