స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2025 లో ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 7,565 ఖాళీలు ఉన్నాయి. పురుషులు, మహిళలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Vacancies:-
* కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) – పురుషులు: 4,408
* కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) – మహిళలు: 2,496
* ఎక్స్-సర్వీస్‌మెన్ (ఇతరులు) – పురుషులు: 285
* ఎక్స్-సర్వీస్‌మెన్ (కమాండో) – పురుషులు: 376
Qualification:-
* విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 ఉత్తీర్ణత.
* వయోపరిమితి: 01 జూలై 2025 నాటికి 18 నుండి 25 సంవత్సరాలు.
* పురుష అభ్యర్థులకు మోటార్ సైకిల్ లేదా కారు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.
Important Dates:-
* చివరి తేదీ: 21 అక్టోబర్ 2025 రాత్రి 11:00 గంటల వరకు
* ఫీజు చెల్లింపు చివరి తేదీ: 22 అక్టోబర్ 2025
* అప్లికేషన్ సవరణ తేదీలు: 29 నుండి 31 అక్టోబర్ 2025
Fee Payment:-
* జనరల్ / OBC / EWS అభ్యర్థులు: రూ.100
* SC / ST / Ex-Servicemen / మహిళలు: ఫీజు లేదు
Selection Process:-
1. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (CBE)
2. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (PET) & ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT)
3. మెడికల్ ఎగ్జామ్
4. డాక్యుమెంట్ వెరిఫికేషన్
Pay scale:- రూ.21,700 నుండి రూ.69,100
Application Process:-
1. SSC అధికారిక వెబ్‌సైట్ https://ssc.gov.in లో లాగిన్ చేయండి.
2. Delhi Police Constable (Executive) Recruitment 2025 లింక్ పై క్లిక్ చేయండి.
3. New Registration ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
4. అప్లికేషన్ ఫారమ్ నింపి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.
5. ఫీజు చెల్లించి, అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
6. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫారమ్ ప్రింట్ తీసుకోండి.