సింగరేణిలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఐటిఐ పూర్తి చేసుకొని అప్రెంటిస్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు సింగరేణి సంస్థ వారు శుభవార్త తెలిపారు. 2024-25 సంవత్సరానికి గాను అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ముందుగా https://www.apprenticeshipindia.gov.in/ పోర్టల్ (NAPS) లో తమ పేరును నమోదు చేసుకోవాలి. సెప్టెంబర్ 9, 2024 ఉదయం 11 గంటల నుండి సెప్టెంబర్ 24 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు సింగరేణి పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత అప్లికేషన్ కాపీని క్రింద తెలుపబడిన పత్రాలను స్థానిక MVTC ఆఫీసులో సమర్పించాలి.

Apprenticeship period: 1 సంవత్సరం.

ITI Trades: ఎలక్ట్రిషన్, ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మిషినిస్ట్, మెకానిక్ మోటార్ వెహికల్, డ్రాఫ్ట్ మెన్ (సివిల్), డిజిల్ మెకానిక్ 

Age Limit:- SC, ST, BC అభ్యర్థులకు 18-33, జనరల్ అభ్యర్థులకు 18-28 సంవత్సరాలు.

 Locality: ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అభ్యర్థులను స్థానికత గుర్తిస్తారు. ఈ అభ్యర్థులకు 95% పోస్టులను భర్తీ చేస్తారు. మిగతా జిల్లాలోని అభ్యర్థులను నాన్ లోకల్ క్యాటగిరి క్రింద 5% పోస్టులను భర్తీ చేస్తారు.

Stipend: 2 సంవత్సరాల ITI కోర్సులకు 8050, 1 సంవత్సరం ఐటిఐ కోర్సుల వారికి 7,700 రూపాయల స్టైఫండ్ ఇస్తారు.

MVTC లో సమర్పించాల్సిన పత్రాలు: అప్రెంటిస్ దరఖాస్తు ఫామ్, 10th మెమో, ఐటీఐ సర్టిఫికెట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, Passport size Photos. 

సింగరేణిలో ల్యాండ్ కోల్పోయిన వారు ఉంటే RDO/MRO నుండి సంబంధిత పత్రాలను జత చేయాలి.

సింగరేణి వారసులు సింగరేణి ఐడి కార్డ్ తో పాటు, పత్రాల మీద గని మేనేజర్ సంతకం తీసుకోవాలి.

Author: Career App Team

Source: SCCL

Official Website: Click here

Apply Link: Click Here

Get in Touch with us: Digitalkasipet@gmail.com

Post a Comment

0 Comments